calender_icon.png 15 January, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బచ్చన్’ అంచనాలను అందుకుంటుంది

09-08-2024 12:05:00 AM

రవితేజ, హరీశ్ శంకర్ కాంబో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. “రవితేజ నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ‘మిరపకాయ్’ సక్సెస్ మా కాంబినేషన్ పై అంచనాలు పెంచింది. ‘మిస్టర్ బచ్చన్’ ఆ అంచనాలు దాటే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.

భాగ్యశ్రీ బోర్సే తెలుగు నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. ఆగస్టు 15న అమితాబ్ బచ్చన్ షోలే సినిమా రిలీజైయింది.. రవితేజ ‘బచ్చన్’ అదే డేట్‌కి రావడం యాదృచ్చికం. అందుకే ట్రైలర్‌లో యాడ్ చేశాం’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ బోర్సే, డీవోపీ బోస్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడి తమ అభిప్రాయాలను సభికులతో పంచుకున్నారు.