calender_icon.png 13 October, 2024 | 5:54 AM

పాపను వదిలించుకున్నారు..

11-09-2024 01:22:15 PM

శిశు సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించిన అధికారులు..

మహబూబ్​నగర్రోజురోజుకు మానవత్వం ఎక్కడా అని వెతుకోవాల్సిన ఆవశ్యకత చోటు చేసుకుంటుంది. ఆడపిల్ల పుట్టిందను లేక ఇతర కారణం ఏంటో తెలియదు కానీ దేవరకద్ర నియోజకవర్గంలో ఓ పాపను సంచిలో తీసుకువచ్చి రోడ్డుపై పక్కకు పెట్టి వదిలి వెళ్ళిన చేదు సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని డోకూరు గ్రామ సమీపంలో  బుధవారం ఉదయం సమయంలో మినీ బస్టాండ్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు ఒక బస్తాలో చిన్నారి పాపను బస్తాలో పెట్టి వెళ్లారు.

దీంతో ఉదయం సమయంలో దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు డోకూర్ నరేందర్ రెడ్డి వాకింగ్ చేస్తుండగా రోడ్డు సమీపంలోని బస్టాండ్ దగ్గర చిన్నారి పాప ఏడుపులు వినిపించడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా బస్తాలో చిన్నారి పాప  ఉండడంతో వెంటనే గ్రామంలోని ఆశా వర్కర్ అంగన్వాడి కార్యకర్తకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు అక్కడికి చేరుకొని బస్తాలో ఉన్న పాపను తీసుకుని దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి పాప ఆరోగ్యంగా ఉందని తెలిపారు. పాప బరువు రెండున్నర కేజీలు ఉందని, వెంటనే జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ సమాచారం ఇవ్వడంతో ఐ సి పి ఎస్  సద్దాం హుస్సేన్ అక్కడికి చేరుకొని చిన్నారి పాపను తీసుకుని బాలల సంరక్షణ కేంద్రంలోకి తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.