26-02-2025 01:59:56 AM
పోలీసుల అదుపులో 11 మంది నిందితులు
మాతా శిశు సంరక్షణ కేంద్రానికి నలుగురు పిల్లలు
ఎల్బీనగర్, ఫిబ్రవరి 25: శిశువులను విక్రయిస్తున్న గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన ముఠాను రాచకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని రాచ కొండ పోలీస్ కమిషరేట్ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. మల్కా చెందిన కృష్ణవేణి బీఎస్సీ బయోకేమిస్త్రీ పూర్తి చేసింది.
వికారాబాద్‌కు చెందిన వ్యక్తితో 2016లో వివాహం జరగగా.. సంతానం లేదని 2019 లో విడాకులు తీసుకున్నది. అనంతరం ఒక కం పని చేస్తుండగా కొత్తపేటకు చెం దిన బత్తుల దీప్తి, సికింద్రాబాద్‌కు చెందిన సంపత్‌కుమార్ పరిచయమయ్యారు. వీరందరూ పిల్లలను విక్రయించాలని నిర్ణయించు కుని సోషల్ మీడియాలో పిల్లలు లేనివారి వివరాలు సేకరిస్తున్నారు.
వీరికి గుజరాత్‌కు చెందిన వందన పరిచయం అ పిల్ల లు కావాలని కృష్ణవేణి సమాచారం ఇవ్వగా నే గుజరాత్ నుంచి వందన ఆడపిల్లలను రూ.1.50 లక్షలకు, మగపిల్లలను రూ.2.50 లక్షల ధరకు హైదరాబాద్‌కు పంపించేది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వందన గుజరాత్ నుంచి ఇద్దరు మగ, ఇద్దరు ఆడశిశువులను తన అనుచరులు సావిత్రిదేవి, సునీతసుమన్ ద్వారా హైదరాబాద్‌లోని కృష్ణవేణి వ ద్దకు పంపించింది.
కృష్ణవేణి తన అనుచరు లు దీప్తి, సంపత్‌కుమార్, శారద, ఉమరాణి, జయశ్రీ, శ్రీకీర్తితో కలిసి ఆడశిశువును రూ.3 లక్షలు, మగశిశువును రూ.5 లక్షలకు విక్రయించాలని నిర్ణ మంగళ వారం చైతన్యపురి బస్టాప్ వద్ద కృష్ణవేణి, సావిత్రిదేవి, సంపత్‌కుమార్ ఒక శిశువుతో అనుమానాస్పదస్థితిలో కనిపించారు.
చైతన్యపురి పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, విషయం వెలుగులోకి వచ్చిం ది. మొత్తం 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి నలుగురి పిల్లలను స్వాధీనం చేసుకుని మాతశిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు.