calender_icon.png 12 February, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమకథను హైలెట్ చేసే బేబీ మా

11-02-2025 12:00:00 AM

సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మజాకా’.  త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ కొలాబరేషన్‌లో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. రీతు వర్మ  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, అన్షు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

మొదటి సింగిల్ బ్యాచులర్స్ ఆంథమ్ శ్రోతల ఆదరణ పొందింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌నూ విడుదల చేశారు. ‘బేబీ మా’ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ గీతం ద్వారా సందీప్ కిషన్ ప్రేమలో పడిన కథను బ్యూటీఫుల్‌గా చూపించారు. సందీప్ తండ్రి రావు రమేశ్, అన్షు ప్రేమకథను కూడా ప్రెజెంట్ చేస్తోందీ పాట.

ఇందులో సందీప్ కిషన్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చంద్రబోస్ సాహిత్యం, లియోన్ జేమ్స్ సంగీతం పాటను మరింత బ్యూటీఫుల్‌గా మార్చాయి. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.