calender_icon.png 24 November, 2024 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్

24-11-2024 12:06:10 AM

  1. ఆస్పత్రి సిబ్బందినని చెప్పి తీసుకెళ్లిన గుర్తుతెలియని మహిళ
  2. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి) : నిలోఫర్ ఆస్పత్రిలో ఓ పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. గుర్తుతెలియని ఓ మహిళ తాను ఆస్పత్రి సిబ్బందినని చెప్పి చిన్నారిని ఎత్తుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జహీరాబాద్‌కు చెందిన హసీనాబేగం, గఫార్ దంపతులకు నెలక్రితం మగపిల్లాడు జన్మించాడు.

అతడికి పసరికలు (జాండిస్) రావడంతో చికిత్స నిమిత్తం తల్లి, అమ్మమ్మ కలిసి శనివారం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే చికిత్స కోసం ఎదురుచూస్తున్న వీరి వద్దకు వచ్చిన ఒక గుర్తుతెలియని మహిళ.. తనను తాను ఆస్పత్రి సిబ్బందిగా పరిచయం చేసుకొని వారి వద్ద నుంచి చిన్నారిని తీసుకెళ్లింది.

ఎంతసేపటికి చిన్నారిని తీసుకురాకపో వడంతో.. తల్లి, అమ్మమ్మ ఆస్ప త్రి మొత్తం వెతికినా చిన్నారి, మహిళ ఎక్కడా కనిపించలేదు. దీంతో తల్లి హసీనా తన కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కిడ్నాపర్ల పట్ల పిల్లల తల్లదండ్రులు అప్రమత్తనంగా ఉండాలని పోలీసులు సూచిస్తు న్నారు.