calender_icon.png 10 January, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముళ్లపొదల్లో పసికందు

02-11-2024 02:22:18 AM

వనపర్తి, నవంబర్ 1 (విజయక్రాంతి): అప్పుడే  పుట్టిన పసికంద ను కనికరం లేని ఓ తల్లి ముళ్లపొదల్లో పడేసింది. పొదల నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు యంత్రాంగానికి సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని బిడ్డను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తెలిసిన వివరాల ప్రకారం.. అమరచింత మండలంలోని కృష్ణంపల్లిలోని ముళ్ల పొదల నుంచి ఆదివా రం ఉదయం గ్రామస్తులకు పసికందు ఏడుపు వినిపించింది.

వెంటనే వారు అంగన్‌వాడీ టీచర్ శశికళకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే ఎంపీడీబీవో, తహసీల్దార్, ఐసీడీఎస్ అధికారులకు తెలిపింది. వారంతా ఘటనా స్థలానికి చేరుకుని పసికందును ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.