- దారుణానికి ఒడిగట్టిన తల్లిదండ్రులు
- పాతబస్తీలో వెలుగు చూసిన ఘటన
చార్మినార్, సెప్టెంబర్ 23 (విజయక్రాం తి): కన్నబిడ్డ అనే ప్రేమ ఆ దంపతులకు లేకపోయింది. పుట్టిన 15 రోజులకే బిడ్డను అమ్మకానికి పెట్టారు. సౌత్ జోన్ టాస్క్‌ఫో ర్స్, చాంద్రాయణగుట్ట పోలీసుల సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో పసికందులను అమ్మే ముఠా గుట్టు రట్టయింది. తెలిసిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పహాడి ప్రాం తంలో దంపతులు షేక్ ఇస్మాయిల్, సుల్తా నా బేగం నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. సుల్తానా బేగం ఇటీవల నాలుగోసారి ప్రసవించి మగబిడ్డకు జన్మ నిచ్చింది.
దంపతులకు ఫలక్ నుమా వట్టేపల్లికి చెందిన మెహది అలీ అలియాస్ సలీం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సలీంకు మరికొందరితో పసికందుల విక్రయానికి సంబంధించిన లావాదేవీలతో సంబంధాలు ఉన్నాయి. అత డు ఏయే ఆసుపత్రుల్లో కాన్పులకు జరుగుతున్నాయి.. ఎవరెవరికి సొమ్ము అవసరం ఉందని గుర్తించి.. వారితో బేరసారాలు సాగిస్తాడు. అలాగే సుల్తానాబేగం మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలుసుకున్నాడు. దంపతులకు నాలుగోబిడ్డను సాకడం కష్టం అనిపించిందేమో తెలియదు గానీ, బిడ్డ అమ్మకానికి సిద్ధమయ్యారు.
సలీం రూ. 2.50 లక్షలకు బేరం కుదిర్చాడు. సులేమాన్‌నగర్‌కు చెందిన ఫాతిమా రెహ్మత్ అనే మహిళకు కాల్ చేసి మగశిశువు అమ్మకానికి ఉందని చెప్పాడు. శిశువును చాంద్రాయణగుట్ట మహాబూబ్‌నగర్ చౌర స్తా వద్దకు తీసుకువస్తున్నారని సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాపుగాసి అక్కడ శిశువు తల్లిదం డ్రులతో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై ఆంజనే యులు, చాంద్రాయణగుట్ట ఎస్‌హెచ్‌వో కె.గురునాథ్ పాల్గొన్నారు.