28-02-2025 12:35:39 AM
అటవీ శాఖ అధికారులకు అప్పగింత
రాజేంద్రనగర్ (కార్వాన్), ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): సుమారు 5 నెలల జింక పిల్ల గుడిమల్కాపూర్ లో అకస్మాత్తుగా కనిపించిన సంఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గురువారం మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌లోని మదీన్ మసీదు వద్ద సుమారు 5 నెలల జింక అకస్మాత్తుగా ప్రత్యక్షమైన్నట్లు 100 డయల్ ద్వారా ఉదయం 9 గంటలకు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జింక పిల్లని స్థానికుల ద్వారా పట్టుకున్నారు. అప్పటికే కుక్కలు వెంటపడడంతో వాటి నుంచి రక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పినట్లు సిఐ తెలిపారు. కాగా జింక పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా తీసుకువచ్చి సాదుకుంటున్నారా...? అనే విషయం విచారణలో తెలుస్తుంది.