07-04-2025 01:37:59 AM
చెన్నై, ఏప్రిల్ 6: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మ దురైలో ఆదివారం నిర్వహించిన పా ర్టీ 24వ జాతీయ మహాసభల్లో 85 మంది సభ్యులతో కూడిన కమిటీ ఆయన్ను ఎన్నుకున్నది. గతేడాది సీతారాం ఏచూరి మృతిచెందిన త ర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి ప దవి ఖాళీగా ఉంటున్నది.
దీంతో అప్పటినుంచి ప్రకాశ్ కారత్ పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా బాధ్యత లు నిర్వర్తిస్తూ వస్తున్నారు. పార్టీ జా తీయ చీఫ్ పదవి రేసులో అశోక్ ధ వలే, మహమ్మద్ సలీం, బీవీ రాఘవులు, బృందా కారత్ వంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ.. చివరకు ఆ పదవి బేబీని వరించింది.
బేబీ నేపథ్యం ఇదీ..
బేబీ 1954లో కేరళలోని ప్రాక్కుళంలో అలెగ్జాండర్, లిల్లీ దంపతుల కు జన్మించారు. బేబీ చిన్నతనంలోనే వామపక్ష ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యారు. సీపీఎం అనుబంధ విదా ్యర్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యుడిగా చేరారు. తర్వాత పార్టీ యువ జన సంఘం డీవైఎఫ్‌ఐలో కీలక నేత గా ఎదిగారు. ఈ క్రమంలో బేబీకి బెట్టీ లూయిస్‌తో వివాహమైంది.
వీ రికి ఒక కుమారుడు అశోక్ బెట్టీ నెల్సన్. బేబీ 1986 -98 వరకు రా జ్యసభ సభ్యుడిగా, 2006- 16 వర కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2011లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 2016 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.