- కేంద్ర బడ్జెట్‌లో తగిన వాటా కేటాయించాలి
- అమిత్ షాతో భేటీలో చంద్రబాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 17 (విజయక్రాంతి): రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కలిశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, అందుకు తగినట్లు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులను కేటాయించాలని కోరారు. దీనితో పాటు ఏపీ అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసిన నాలుగు శ్వేత పత్రాలకు సంబంధించి అమిత్ షాకు వివరణ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. 2019 2024 మధ్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్థిర పరిచాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీతో పాటు జేడీయూ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు తమకు కేంద్ర బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.