21-04-2025 01:11:22 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణ ఒలంపిక్ అ సోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్‌గా బాబు లాల్ నియమితులయ్యారు. ఆదివారం ఆయనకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబూలా ల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పది బాధ్యతల భరించిన జితేందర్ రెడ్డి , కార్యదర్శి మల్లారెడ్డి, చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.