- పవార్ ఏదో ఒక రోజు సీఎం కావడం ఖాయం
- మహా అసెంబ్లీలో ఫడ్నవీస్ వ్యాఖ్యలు
ముంబై, డిసెంబర్ 19: రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)ని చీల్చి ఎన్సీపీ (అజిత్ పవార్) పేరుతో ఎన్డీయే కూటమిలో చేరిన పవార్‌కు ఏదో ఒకరోజు తప్పకుండా ‘సీఎం పవర్’ సొంతం అవుతుందని మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అ భిప్రాయపడ్డారు.
గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మీరు ఎప్పటి కీ డిప్యూటీగానే ఉండిపోరు. ఏదో ఒ కరోజు సీఎం అవుతారు’ అని అన్నా రు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా సీఎం ఇ లా వ్యాఖ్యానించారు. ఈ సందర్భం గా డిప్యూటీల పనితీరు గురించి కూ డా సీఎం వ్యాఖ్యానించారు.
అజిత్‌తో పాటు షిండేను కూడా..
డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ ప వార్‌తో పాటు మరో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను కూడా సీఎం ఫడ్నవీస్ పొగడ్తలతో ముంచెత్తారు. ఉద యం లేవగానే అజిత్ పవార్ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారన్నారు. మరో డిప్యూటీ షిండే రాత్రంతా పని చేస్తూనే ఉంటారని వ్యాఖ్యానించా రు.
ఇటీవలే ఆరోసారి సీఎంగా బా ధ్యతలు స్వీకరించిన ఫడ్నవీస్ 2023 లో నాటకీయ పరిణామాల మధ్య సీఎం కుర్చీని వదులుకోవాల్సి వ చ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించగా.. బీజేపీ తరఫున ఫడ్నవీ స్ సీఎంగా, ఎన్సీపీ తరఫున పవార్, శివసేన తరఫున ఏక్‌నాథ్ డిప్యూటీలుగా బాధ్యతలు స్వీకరించారు.