calender_icon.png 15 January, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

06-07-2024 02:02:19 PM

మంథని, (విజయక్రాంతి): మంథనిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను మంథనిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్ మాట్లాడుతూ... డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దూరదృష్టి గల నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోలు శివ, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, నాయకులు ఆర్ల నారాయణ, మోహన్, కిషన్ జి, మంథని సురేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ నాయకులు పెరవెన లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.