05-04-2025 08:56:45 PM
మందమర్రి (విజయక్రాంతి): దళితుల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని లెదర్ పార్క్ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత సంఘాల నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ మాట్లాడుతూ... 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పదవులు నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో బాబు జగ్జీవన్ రామ్ అని ఆన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి సపోర్ట్ చేసినప్పటికి, 1977లో జనతా పార్టీలో చేరి భారతదేశం ఉప ప్రధానిగా 1977 నుండి 1979 వరకు కొనసాగారన్నారు.
భారతదేశంలో అనేక మంత్రీ పదవులు నిర్వహించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు చదివి ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి అణగారిన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన నాయకులు నోముల దుర్గాప్రసాద్, రాము, లెదర్ పార్క్ అధ్యక్షులు కొలుగురి విజయకుమార్, సదా సేవ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సంగి సంతోష్, ఉప్పులేటి నరేష్, నాయకులు బచ్చలి భీమయ్య సోమవారపు సామిల్, దరిపెళ్లి కనకయ్య, కొలుగురి పృథ్వి రాజ్, కాంగ్రెస్ నాయకులు బత్తుల సరిత, బొడ్డు వినోద, ధరిపెళ్లి సరూప రాణి, దాసరి సరిత, కాంపల్లి లక్ష్మి లు పాల్గొన్నారు.