calender_icon.png 18 April, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2025 08:30:53 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ 118 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలోని చర్మకారుల జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం సింగరేణి లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్ ముఖ్యఅధితిగా హాజరై ప్రసంగించారు. డా.బాబు జగ్జీవన్ రామ్, సుధీర్ఘకాలం రాజకీయ జీవితం గడిపి, తను కొవ్వొత్తిలాగ కరిగిపోతు దళితుల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయులు అని కొనియాడినారు.

డా.బి.ఆర్.అంబేద్కర్  రాసిన భారత రాజ్యాంగాన్ని పూర్తిగా పార్లమెంట్ లో అమలు జరిగే విధంగా కృషి చేసిన వ్యక్తి అని, కార్మిక చట్టాలను, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హరిత విప్లవం, రైల్వేలో దళితులకు అవకాశాలు, రక్షణ శాఖలో అనేక సవరణలు,దేశ ఉప ప్రధానికి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తిగా భారతదేశ చరిత్ర లో లిఖించరని తెలిపినారు. ఈ కార్యక్రమంలో డా.జీ.యస్.ఆర్.ట్రస్ట్ కో ఆర్డినేటర్, మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ, జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోదుగు జోగారావు, ఏజన్సీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు బొమ్మర్ల శ్రీనివాస్,ఆటో యూనియన్ నాయకులు కనకం సూరి,నరాల రాజేష్, దూడపాక శివ ప్రసాద్,పెద్దపుడి రాము, పెట్టల సతీష్,పెద్దపడి నాగేంద్ర బాబు, ఇనపనూరి బాబు, ఆముదాల ప్రసాద్, గడ్డపార్ల శ్రీను, జైదా వెంకన్న, అంబాల శ్రీను, బోట్ల శ్రీను, కుంపటి నాగరాజు, బండిపెల్లి కిరణ్, కండె మహేష్ తదితరులు పాల్గొన్నారు.