calender_icon.png 6 April, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమానత్వం, సామాజిక న్యాయం కోసం పనిచేసిన మహనీయుడు

05-04-2025 08:54:11 PM

బాబు జగ్జీవన్ రామ్ 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 

సంగారెడ్డి,(విజయక్రాంతి): సమానత్వం, సామాజిక న్యాయం కోసం  పని చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ స్వతంత్ర సమరయోధుడిగా, మాత్రమే కాకుండా స్వాతంత్రానంతరం భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన మహనీయుడు అన్నారు. అత్యధిక కాలం భారత క్యాబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ కు దక్కుతుందన్నారు. భారత ఉప ప్రధానమంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రి, రక్షణ మంత్రిగా, రైల్వే మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన మహనీయుడన్నారు. అలాంటి మహనీయుని సేవలను స్మరించుకోవడం భవిష్యత్ తరాలకు గుర్తుకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమానత్వం సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా భారత దేశ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ స్థానం చిరస్థాయిగా నిలిచింది అన్నారు. 

సమానత్వం సామర్థ్య న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి భారత మాజీ ఉప ప్రధాని  డా" బాబు జగ్జీవన్ రామ్  చెప్పారు.   డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. టీజీఐఐసి చైర్మన్  నిర్మలా జగ్గారెడ్డి , జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు , ఎస్పీ పరితోష్ పంకజ్,అధికారులు ,వివిధ సంఘాల ప్రతినిధులు బాబూ జగ్జీవన్ రామ్  విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ డా '' బాబు జగ్జీవన్ రామ్ ఈ పదవి లో కొనసాగిన ఆ పదవికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి అన్నారు.  ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో భారత దేశంలో హరిత విప్లవం కొనసాగించాలన్నారు. శాఖ మంత్రిగా ఇండోపాక్ యుద్ధం లో భారత గెలుపు కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు రైల్వే శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైల్వేలను లాభాల పట్టించారు. ఆధునిక భారత నిర్మాణం ఆయన పాత్ర మరువలింగం సుదీర్ఘకాలం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసే ఆయన బాధ్యతలు చేపట్టిన పదవులకే వన్నెతెచ్చిన మహనీయుడు అన్నారు.

ఇలాంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటితరం విద్యార్ధులు స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. యువత ఆయన ఆదర్శాలను ప్రేరణగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. సంగారెడ్డి, కల్వకుంట రోడ్డులో ఏర్పాటుచేసిన  డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి  సభలో టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  పాల్గొని మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ సూచించిన అన్ని వర్గాలకు సమ న్యాయం అనే మార్గంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నదని, కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయన్నారు. యువత ఆయన జీవితం నుండి ఆయన ఆదర్శాలను అనుసరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నిర్వహించిన జయంతి కార్యక్రమంలో వక్తలు పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు.