calender_icon.png 20 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2025 04:34:38 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ దళిత సంఘాల ఐక్య వేదిక ఆద్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ ఆఫిస్ ప్రాంతంలో ఉన్న బాబుజగ్జీవన్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ సభ్యులు రేణికుంట ప్రవీణ్ తో కలిసి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావుతో పూలమల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు.