calender_icon.png 6 April, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి

05-04-2025 08:48:08 PM

జయంతి వేడుకల్లో పలువురు వక్తల పిలుపు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): నేటితరం విద్యార్ధులు బాబు జగ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం దేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి, చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, శాసన సభ్యులు పాయల్ శంకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్,, ఎస్పీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దేశానికి, దళిత వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు,  రాజకీయ నాయకుడు గా ఆయన ఎన్నో పోరాటంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.