05-04-2025 09:11:40 PM
టీడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్
సంగారెడ్డి,(విజయక్రాంతి): భారత తొలి దళిత ఉప ప్రధాన మంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాలలో జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంగారెడ్డి లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో టీడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎల్గోయి ప్రభాకర్ పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమ కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గయ్య, జర్నలిస్టు కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.