05-04-2025 05:42:34 PM
పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పట్టణ నాయకులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పట్టణ బీజేపీ నాయకులతో కలిసి జయంతి వేడుకలు జరిపారు. అమీన్ పూర్ తహసీల్దార్ కార్యాలయంలో చిత్రపటానికి ఉప తహసిల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఆర్ఐ లు రఘురాం రెడ్డి, శ్రీమాన్ రాజు సిబ్బందితో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఐడీఎ బొల్లారం, మాదారం, ఊట్ల తదితర గ్రామాలలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.