05-04-2025 04:42:44 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి బాబు జాగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను అందరూ కొనసాగించాలని బీజేపీ నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.