05-04-2025 04:34:03 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మాదిగ కుల సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాదిగ కుల సంఘ నాయకులు మాట్లాడుతూ... జగ్జీవన్ రామ్ పంజాబ్ లో ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి దేశంలో అత్యున్నత పదవి అయిన ఉప ప్రధానిగా, కేంద్ర రక్షణ మంత్రి, కార్మిక, వ్యవసాయ, శాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవ చేశారు. అలాగే స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. శనివారం ఒక గొప్ప నాయకుని స్మరించుకోవటం ఆనందంగా ఉంది అని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ నాయకులు, నర్సింలు, బాలయ్య, రాజలింగం, రాజానర్సు, బిక్షపతి, ధర్మపురి, శివకుమార్, బోలెశ్వర్, తదితరులు పాల్గొన్నారు.