calender_icon.png 19 April, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

05-04-2025 04:30:29 PM

చేగుంట,(విజయక్రాంతి): ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో  చేగుంట లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.... 1946లో అతను జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో  మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి అని, అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగింది అని,, భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను దేశానికి  గొప్ప సహకారం అందించాడని, 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రయత్నించాడని వారు అన్నారు.