calender_icon.png 6 April, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

05-04-2025 07:21:24 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శనివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి మహేష్ మాట్లాడుతూ.. దళిత హక్కుల సాధనకై పోరాటం చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన జగ్జీవన్ రామ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లయ్య, మచ్చ రాజేష్, శివ, రాచకొండ నరేష్, పుల్లూరి రాము, కాంపల్లి శంకర్, గుడిసెల రాజు, చిన్న రాజం రత్నం ఐలయ్య మిట్టపల్లి మల్లేష్, మంతెన కొమురయ్య, బొంకూరి రామచంద్ర, ఆయిళ్ల రామకృష్ణ, రాజేష్, అడ్డూరి వెంకన్న, శంకర్, రామగిరి వెంకటి, తంబి బుజ్జక్క తదితరులు పాల్గొన్నారు.