05-04-2025 08:49:13 PM
ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు..
జహీరాబాద్: కులరహిత సమాజం కోసం బాబు జగ్జీవన్ రామ్ పాటుపడ్డారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనేంటి మాణిక్ రావు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ బీజ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయన తెలిపారు.
దేశ స్వాతంత్రం కోసం సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత దేశ మాజీ ప్రధానిగా సేవలందించి న మహోన్నతమైన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. మనమందరము బాబు జగ్జీవన్ రామ్ లక్ష్యం కోసం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై నరోత్తం, స్వప్న భాస్కర్ సంజీవ్ రామారావు కిరణ్ మ్యూజిక్ సురేష్ విజయ్ జగదీష్ దేవదాస్ మిథున రాజ్ తదితరులు పాల్గొన్నారు.