05-04-2025 04:31:23 PM
బిఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్య..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బాబు జగ్జీవన్ రామ్ అణగారిన కులాలకు సామాజిక సమరత్వం కోసం తుది శ్వాస వరకు పోరాటం చేశారనీ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం బెల్లంపల్లిలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య మహనీయునీ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత దేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబుజి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్, టౌన్ యూత్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆలీ బాయ్,సాజిద్ వాజిద్, నాయకులు కాంపల్లి రాజo , సుందర్ రావు, అస్లాం, ఖలీల్, కలీం, మద్దెల గోపి, చంద్రశేఖర్, మనీ, అఖిల్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.