05-04-2025 10:10:38 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. KTPS అంబేద్కర్ సెంటర్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం, డిష్ నాయుడు, మల్లెల రవిచంద్ర, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాష్, భూక్య చందు నాయక్, సమ్మయ్య గౌడ్, పట్టణ BRS మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల, BRSV పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బేతంశెట్టి విజయ్, తదితరులు పాల్గొన్నారు.