calender_icon.png 6 April, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపిటలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2025 08:53:45 PM

సదాశివపేట: పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు సుక్కల నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ప్రముఖులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పురపాలక సంఘం కమీషనర్ ఉమా, సదాశివపేట పోలీస్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, మాజీ పురపాలక సంఘం అధ్యక్షులు అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, బాబు జగ్జీవన్ రామ్ కి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సుక్కల నాగరాజ్ మాట్లాడుతూ.. చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షను  దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ బీహార్ లోని చంద్వ గ్రామంలో తండ్రి శోబిరం తల్లి బసంతిదేవి గార్లకు 8వ సంతానం 1908 ఎప్రిల్ 5 నాడు జన్మించారు.

జగ్జీవన్ రామ్ దేశ స్థాయిలో అత్యున్నత పదవులను అలంకరించారు. స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో సభ్యునిగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విదంగా వ్యవహరించారు. భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా తదుపరి వ్యవసాయ,రక్షణ శాఖలను నిర్వహించి దేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగిన రికార్డు వారి సొంతం. దానితో పాటుగా 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు చట్ట సభలలో సభ్యునిగా ఉండడం ప్రపంచ రికార్డు. అన్ని వర్గాల ఆదరణ, సేవాభావంతోనే వారు అన్ని దశాబ్ధాలు రాజకీయ, ప్రజా జీవితంలో కొనసాగారు. నేటి రాజకీయ నాయకులకు బాబు జగజ్జీవన్ రామ్  ఆదర్శం, పదవులకు వన్నె తెచ్చిన నాయకులు అని అన్నారు.