05-04-2025 04:05:24 PM
చేగుంట,(విజయక్రాంతి): గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని చేగుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. అయన 118 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ, అతను ఒక దేశ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం అని అతను ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ, వర్గాలకు నాయకులు దేశాన్ని పాలించే నాయకులు గా ఏదుగాలానే కోరుకునే మహా వ్యక్తి అని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు బాబూజీ అని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని, కార్మిక లోక పక్షపాతి బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.