05-04-2025 03:48:00 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద దళిత సంఘాలు ఆయన జయంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మేష సతీష్, దేవతి రాజేశ్వర్ లు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు తాళ్లపల్లి రాజా గంగన్న ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్, బ్యాంకు క్యాషియర్ అంబేద్కర్ కుమార్, ఉపాధ్యాయులు నరసయ్య, సుద్దాల మహిపాల్, పండుగ పెద్దలు, నయీమ్, ప్రవీణ్ ,దళిత సంఘాల నాయకులు ,తదితరులు ఉన్నారు.