calender_icon.png 6 April, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టడుగు వర్గాలకు దిక్సూచి బాబు జగ్జీవన్ రాం

05-04-2025 06:15:46 PM

పెన్ పహాడ్: దేశ భవిష్యత్తు కోసమే కాదు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబు జగ్జీవన్ రాం దిక్సూచిగా నిలిచారని ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు పయనించాలని సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, మహేష్, టీఏ లు బుచ్చన్న, అనూష, వెంకటేశ్వర్లు, రాం కుమార్, సైదయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు.