మందమర్రి (విజయక్రాంతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఆదిల్ పేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ బాబు ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఎంపిక అయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులైన బాబును ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఘనంగా సన్మానించారు. కాగా ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఎంపికైన బాబును ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా అధ్యక్షులు ఈద లింగయ్య, మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు లింగాల రాజేందర్, పుస్తె రవి, సత్యనారాయణ భూమా, రాజన్న, శంకరయ్యలు అభినందించారు.