calender_icon.png 31 October, 2024 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బాబ్లీ గేట్లు ఎత్తివేత

01-07-2024 01:26:47 AM

నిజామాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా  గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం త్రిసభ్య కమిటీ ఎత్తనున్నది. తీర్పు ప్రకారం ఈ నెల 28 వరకు జలాలు విడుదలవుతూనే ఉంటాయి. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండానే  శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి జలాలు చేరతాయి. త్రిసభ్య కమిటీ సభ్యులు గేట్లు ఎత్తే పనులను పర్యవేక్షిస్తారు.

బాబ్లీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వసామర్థ్యం 2.74 టీఎంసీలు కాగా, ఆదివారం సాయంత్రానికి 0.2 టీఎంసీలకు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1059.60 ఫీట్లకు చేరింది. 10.188 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 3.875 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరగా, 1.205 టీఎంసీల నీరు బయటకు వెళ్లింది.