calender_icon.png 3 March, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

02-03-2025 01:04:27 AM

వేసవిలో తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలు విడుదల

నిజామాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): వేసవి లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లను అధికారులు శనివారం ఎత్తి, 0.6 నీటిని విడదుల చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ఇరిగేషన్ అధికారు లు హాజరయ్యారు. 2013లో సుప్టీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కేంద్ర జలవనరుల సంఘం ఒప్పం దం మేరకు ఏటా జూలై 1వ తేదిన ఈ గేట్లను తెరు స్తారు. ఆ తర్వాత 120 రోజుల పాటు ఈ గేట్లు తెరిచి ఉంటాయి. తిరిగి అక్టోబర్ 29న మూసివేస్తారు. గేట్ల ఎత్తివేతతో నిజామాబాద్, నిర్మల్ జిల్లా బాసర మీదుగా నీరు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వైపు ప్రవహి స్తుంది. గేట్లు ఎత్తివేయడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పవన్‌చంద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.