calender_icon.png 16 March, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆధునికరించాలి

15-03-2025 10:45:30 PM

కమీషనర్ కు దళిత ప్రజా సంఘాల, నాయకుల వినతిపత్రం

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న బేస్మెంట్ గద్దె చుట్టూ రాజ్యాంగంలోని సూక్తులతో కూడిన నూతన టైల్స్ అమర్చి ఆధునికరించాలని శనివారం మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు దళిత, ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమం కంటే ముందే చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహాన్ని నూతన హంగులతో ఆధునీకరించి, వాటర్ ఫౌంటెన్ రిపేరు చేపించి లైటింగ్స్ ఏర్పాటు చేయాలని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు బూడిద తిరుపతి,  బూడిద గణేష్, మంథని రాకేష్  గొర్రింకల సురేష్, మంథని లింగయ్య, మంథని రాజేశం, పోయిల తిరుపతి, బాబు రవి తదితరులు పాల్గొన్నారు.