calender_icon.png 25 October, 2024 | 12:50 PM

ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్

25-10-2024 10:10:23 AM

ముంబై: మహారాష్ట్ర రాజకీయ కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మాజీ మంత్రి, తండ్రి బాబా సిద్ధిక్ హత్య తర్వాత ముంబై యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జీషాన్ సిద్ధిఖీ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. బాంద్రా తూర్పు నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా జీషన్ సిద్ధిఖీని పార్టీ నిలబెట్టింది. అంతకుముందు ఆగస్టులో, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు అవకాశం కల్పించారనే ఆరోపణల కారణంగా ఆయన కాంగ్రెస్ నుండి బహిష్కరించబడ్డారు. ఈ ఆరోపణలను జీషన్ ఖండించారు.

"ఇది నాకు, నా కుటుంబానికి ఎమోషనల్ డే. ఈ కష్ట సమయాల్లో నన్ను నమ్మినందుకు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాంద్రా ఈస్ట్ నుండి నాకు నామినేషన్ లభించింది, ప్రేమతో ప్రజలందరి మద్దతు, నేను ఖచ్చితంగా బాంద్రా ఈస్ట్ యే మళ్లీ గెలుస్తాను...’’ అని జీషన్ సిద్ధిఖీ అన్నారు.