calender_icon.png 19 April, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాడవాడలా అంబేద్కర్ జయంతి

15-04-2025 12:00:00 AM

జైభీం నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం

తరలి వచ్చిన అంబేడ్కర్ అభిమానులు, వివిధ సంఘాల కార్యకర్తలు

బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(విజయక్రాంతి) : డా.బీఆర్ అంబేడ్కర్ జయం తి సందర్భంగా నగరంలోని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్ద జనసందోహం నెలకొంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విగ్రహ ప్రాంగణంలో అలంకరణ చేసి లోని కి వెళ్లేందుకు అనుమతించింది. దీంతో ఉద యం నుంచే అంబేడ్కర్ సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు చెందిన కార్య కర్తలు, నాయకులు, అభిమానులు తరలి వచ్చారు.ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి నివాళులర్పించారు.

మూడ నమ్మ కాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో పలువురు భారీ సంఖ్యలో నల్ల చొక్కాలు ధరించి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం వ్యవస్థాపకులు భైరి నరేష్, ప్రొ.కాశీం, కవి జయరాజు ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను చదివి, అంబేడ్క ర్‌కు బ్లాక్ సెల్యూట్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మూడు జంటలు అంబేడ్కర్ సాక్షిగా కులాంతర వివాహాలు చేసుకున్నా యి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీపీ మండల్ మనువడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్, బీఆర్‌ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ప్రా ంగణంలోని మొదటి అంతస్తుకు వెళ్లి నివాళులర్పించేందుకు ప్రయత్నించడంతో పోలీ సులు వారిని అడ్డుకోవడం స్వల్ఫ ఉద్రిక్తతకు దారి తీసింది. 

అంబేడ్కర్ జీవితాంశాలపై ఎగ్జిబిషన్ ప్రదర్శన

 విగ్రహ ప్రాంగణంలోని మ్యూజియం, గ్యాలరీలో అంబేడ్కర్ జీవితాంశాలపై పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను, అంబేడ్కర్ ఫొటో గ్యాలరీని ప్రదర్శించారు. వాటిని తిలకించేందుకు సం దర్శకులు ఉత్సాహం ప్రదర్శించారు. పలు ఎగ్జిబిట్లు సందర్శకులను ఆలోచింపజేశాయి. కొంత కాలంగా మూసి ఉన్న ప్రాంగణంలోకి అనుమతించడంతో సందర్శకులు, అంబేడ్కర్‌వాదులు హర్షం వ్యక్తం చేశారు.