స్టుల్‌గా టికెట్ ఇస్త్తూ.. అంతే స్టుల్‌గా దమ్ములాగే ఆయనను చూసిన తోటి కండక్టర్‌లు ఒక దేశం గర్వించదగిన హీరో అవుతాడని ఊహించలేదు. ఆ స్టులే ఆయనను సినిమా అవకాశం వెదుక్కుంటూ వచ్చేలా చేసింది. ఆ తరువాత స్టుల్‌గా కళ్లజోడు పెట్టుకోవడం.. జుట్టు తిప్పడం వంటివన్నీ జనాలకు దగ్గర చేశాయి. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ తను నడిచే దారిని రహదారి చేసుకున్నారు. ఆయన ఒక్కసారి డైలాగ్ చెబితే అది జనాల గుండెల్లో వందసార్లు మారుమోగింది. ఒక సాధారణ వ్యక్తి.. అసాధారణ వ్యక్తిగా మారేందుకు సాగించిన ప్రయాణం చిన్నదేమీ కాదు. అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని.. అన్నీ ఉన్నా మార్పులేని వ్యక్తిత్వం ఆయన సొంతం. సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క భారతీయ నటుడు.. ఆయనే తలైవా రజినీకాంత్. తెరపై భాషా.. తెర వెనుక బాబా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..
ఇవాళ రజినీకాంత్ పుట్టినరోజు. ఆయన 1950 డిసెంబర్ 12న బెంగళూరులో జన్మించారు. నేడు 75వ ఏట రజినీ అడుగు పెట్టారు. కూలిగా.. కార్పెంటర్‌గా.. బస్ కండక్టర్‌గా.. ఆపై సినీ హీరోగా ఆయన ప్రయాణం సాగింది. పేద కుటుంబంలో జన్మించడం.. 9 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోవడం.. ఆ తరువాత ఎన్నో కష్టనష్టాలను దాటుకుని గొప్ప పేరు, స్టార్ సెలబ్రిటీ స్టేటస్‌ను సాధిం చడం అనేది సినిమాల్లోనే చూస్తుంటాం.
వాటిని నిజం చేసే వ్యక్తులు వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంత మంది మాత్రమే ఉం టారు. వారిలో రజినీకాంత్ ఒకరు. కూ లి నుంచి దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వరకూ ఆయన సాగించిన ప్రస్థానం అనిర్వచనీయం, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. 1975లో ‘అపూ ర్వ రాగంగళ్ (తమిళం) చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తొలి తెలుగు సినిమా ‘అంతులేని కథ’. తొలినాళ్లలో విలన్‌గానూ మెప్పించిన రజినీకాంత్.. ఆ తరువాత హీరోగా మారారు. 1978వ సంవత్సరం ఆయనకు మరపురానిది. ఎందుకంటే ఆ ఏడాది ఆయన నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి.
అరవింద్ స్వామి షాకయ్యారట..
ఒకసారి బెంగుళూరులోని ఓ గుడిలో ఆయన కూర్చొ ని ఉన్నారట. అప్పుడు ఆయనను యాచకుడిగా తలచి చేతిలో డబ్బులు వేశారట. ఈ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో చెప్పా రు. కాబట్టి తాను పైపై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వనని తెలిపారు. ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పే మరొక ఘటన ఏంటంటే.. ‘దళపతి’ సినిమాలో అరవింద్ స్వామి కూడా నటించారు. అప్పటికి రజినీతో పోలిస్తే ఆయనొక చిన్న నటుడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అరవింద్ స్వామి తనకు తెలియక రజినీ రూమ్‌కి వెళ్లి బెడ్‌పై పడుకుని నిద్రపోయారట. రజినీ వెళ్లేటప్పటికీ అరవింద్ స్వామి గాఢ నిద్రలో ఉన్నారట. ఆయనను నిద్ర లేపడం ఇష్టం లేని రజినీ గది లో నేలపై పడుకున్నారట. ఉదయం లేచి చూసిన అరవింద్ స్వామికి నోటమాట రాలేదట.
తన విషయంలో రజినీ వ్యవహరించిన తీరును చూసి ఆశ్చర్యపోయారట. 1996 ఎన్నికల్లో రజినీ ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో మరో పార్టీ తరుఫున ప్రచారం నిర్వహిస్తున్న మనోర మ ఆయనను విమర్శించారు. దీంతో ఆమె సినీ అవకాశాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న రజినీ ఆమెను పిలిచి మరీ తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇవి ఆయన కొండంత వ్యక్తిత్వానికి మచ్చుతునకలు మాత్రమే.
మూడేళ్లు తిరక్కుండానే తిరుగులేని సమాధానం..
నటుడిగానే కాదు.. స్క్రీన్ రైటర్‌గా, గాయకుడిగా, నిర్మాతగా అన్నివిధాలుగా రాణించారు. 2002లో వచ్చిన ‘బాబా’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో రజినీకాంత్ పని అయిపోయిందని.. వయసై పోయిందని రకరకాల వార్తలొచ్చాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత ‘చంద్రముఖి’తో విమర్శకులకు తిరుగు లేని సమాధానమిచ్చారు. ఇప్పటికీ ఆయన ఖాతాలో వరుస సక్సెస్‌లను వేసుకుంటూనే ఉన్నారు. తన సినిమాలు ఏవైనా నష్టాలను మిగిల్చితే.. ఆ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా వారికి డబ్బుని తిరిగిచ్చే కొత్త సంస్కృతిని చిత్ర పరిశ్రమకు రజనీకాంతే పరిచయం చేశారు. రజినీ ఇటీవలి కాలంలో స్టుల్ మార్చారు.
తన వయసు తగిన పాత్ర లు ఎంచుకుంటూ సక్సెస్‌ను సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనను మార్చుకుంటూ సక్సెస్ రేటును పెంచుకుంటున్నారు. 75 ఏళ్లు.. 170 సినిమాలతో ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ం ఆయన ‘కూలీ’, ‘జైలర్ 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా ఎన్నో మరపురాని సినిమాలు చేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్‌డే రజినీకాంత్.
వ్యక్తిగత జీవితం
అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. నలుగురు పిల్లల్లో అందరికంటే చిన్నవాడు. రజినీకాంత్ సతీమణి పేరు లతా రంగాచారి. యతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని అయిన లత తన కళాశాల మ్యాగజైన్ కోసం రజినీని ఇంటర్వ్యూ చేశారు. ఆ తరువాత 1981లో వీరి వివాహం జరిగింది. వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలున్నారు.