న్యూఢిల్లీ, జనవరి 7: లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బా బా ఆశారాంకు సుప్రీం కోర్టు మధ్యంత ర బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స చేయించుకోవాలని, అందుకు బెయిల్ మంజూరు చేయాల ని ఆయన సుప్రీంను ఆశ్రయించగా, న్యాయస్థానం మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసింది.
మరో లైంగిక దాడి కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చే వరకూ బాబా ఆశారాం జైలులోనే ఉండాలి. బెయిల్‌పై విడుదలైన తర్వాత బాబా తన అనుచరులను కలవొద్దని న్యాయస్థానం సూచించింది. ఆసుపత్రికి వెళ్లేటప్పుడు బాబాకు కేవలం రక్షణ మాత్రమే కల్పించాలని, ఆయన ఎక్కడికి వెళ్లాలనేది నిర్ణయించవద్దని అధికారవర్గాలను ఆదేశించింది.