21-02-2025 01:18:56 AM
హైదరాబాద్, 20 ఫిబ్రవరి (విజయక్రాంతి): ‘బాహ సే ఇండియా 2025’ చాలా ప్రత్యేకం అని బాహ సే ఇండియా నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు బాలరాజు సుబ్ర తెలిపారు. సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్‌ఏఈ), శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఎస్‌ఏఈ బాహ సే ఇండియాతో కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇన్‌స్టిట్యూ ఆఫ్ టెక్నాలజీలో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు అంతర్ కళాశాలల ఈవెం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సమా లో ఆయన వివరాలు వెల్లడించారు. బాహ సే ఇండియా పద్దెనిమిదో సంచిక అన్నారు. ఇప్పుడు పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటుందని చెప్పారు. 2015లో కేవలం 8 జట్లతో ప్రారంభమైన ఈ బాహ సే ఇప్పుడు 85 పైగా జట్లు పోటీ పడే స్థాయికి ఎదిగిందన్నారు.
బీవీఆర్‌ఐటీ తరఫున శ్రీ విష్ణు ఎడ్యు కేషనల్ సొసైటీ కార్యదర్శి ఆదిత్య విస్సం మాట్లాడుతూ.. బాహసే ఇండియా ఎప్పు డూ యువ ఇంజినీరింగ్ ప్రతిభకు గొప్ప వేదిక అన్నారు. బీపీసీఎల్ హైదరాబాద్ టెరిటరీ మేనేజర్ శ్రవణ్ కుమార్ మాటా ్లడుతూ..
బాహ సే ఇండియాతో బీపీసీఎల్ భాగస్వామ్యం అద్భుత భు ఆటోలివ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శివకుమార్ సుధాచంద్రన్ను సేఫ్టీ అంబాసిడర్గా, దీప్తి సింగ్‌ను డైవర్సిటీ అంబాసిడర్‌గా నియమించారు. మరింత సమాచారానికి 995 9154371 / 996 నంబర్లలో సంప్రదించాలన్నారు.
కార్యక్రమంలో రెనాల్ట్ నిస్సాన్ టెక్నా బిజినెస్ సెంటర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (హ్యూమన్ రిసోర్సెస్) సిమోనా అడెలినా పోపోవిసీ, బాహ సే ఇండియా కన్వీనర్ వినోద్ కుమా ర్ బాలసుబ్రమణియన్, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పరశురామ్ పాకా పాల్గొన్నారు.