17లోగా దరఖాస్తు చేసుకోండి: ఎంజేపీ కార్యదర్శి సైదులు
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మహా త్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఏ యానిమేషన్ అండ్ వీఎఫ్‌ఎక్స్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బీసీ యువతలో నైపుణ్యం పెంచి సృజనాత్మకతకు మెరుగులు దిద్దే కోర్సులను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ తరహా కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024 విద్యాసంవత్సరా నికి ఈ కోర్సులో చేరడానికి ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని పూర్తిచేసి, స్కాన్ చేసి mjpanimation45@gmail.comకు పంపించాలని సూచించారు. అదేవిధంగా మెయిల్‌లో పంపించిన దరఖాస్తును కాలేజీ అడ్రస్‌కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని కోరారు. వివరాలకు 90326 44463, 90632 42329 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.