calender_icon.png 19 April, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

19-04-2025 09:16:19 AM

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి(GATE Engineering College Student)ని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని(B.Tech student) బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ విద్యార్థిని మంచిర్యాల జిల్లాకు చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాదికి ఇంటికి వెళ్లి నిన్న తల్లితో కలిసి విద్యార్థిని కళాశాలకు వెళ్లింది. తెల్లవారుజామున కళాశాల భవనంపై నుంచి దూకి కృష్ణవేణి ప్రాణాలు తీసుకుంది. కాలేజీ యాజమాన్యం సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.