calender_icon.png 9 October, 2024 | 5:57 AM

ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్

09-10-2024 01:39:23 AM

  1. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా 3.8 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఈడీ అభియోగం 
  2. ఇటీవల ఆయనకు నోటీసులు ఇచ్చిన అధికారులు
  3. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్న అజారుద్దీన్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసి యేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రె స్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కు హాజరయ్యారు. గతంలో ఆయన హెచ్‌సీ ఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తిం చారు.

దీంతో గత వారం ఆయనకు నోటీసు లు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణ నిమిత్తం వచ్చారు. నిధుల అవకతవకలపై అజారుద్దీన్‌ను ఈడీ పలు కోణాల్లో పది గంటల పాటు విచారించింది. కాగా, 2020 మధ్య కాలంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ. 3.8 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేశారని ఈడీ ఆయనపై అభియోగం మోపింది.

ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. హెచ్‌సీఏ ఆడిట్‌లో కూడా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆధారాలు సైతం బయటపెట్టింది. అయితే, ఈ కేసులో ఇప్పటికే అజా రుద్దీన్ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. 

ఉప్పల్‌లో నమోదైన కేసు ఆధారంగా

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక పరి కరాలు, క్యానోపీల సేకరణ, క్రికెట్ బాల్స్ కోసం కేటాయించిన నిధులను దుర్వినియో గం చేశారని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై అజారుద్దీన్‌పై గతేడాది అక్టోబర్‌లో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆయన తో పాటు పలువురు హెచ్‌సీఏ మాజీ అధికారులపై కూడా పోలీసులు క్రిమినల్ కేసు లు నమోదు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశా రు. ఆ కేసులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి గతేడాది నవంబర్‌లో అజారుద్దీన్ బెయిల్ పొందారు.

తాజాగా విచారణ చేపట్టిన ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, నిధుల మళ్లింపు జరిగిందని భావించి న హెచ్‌సీఏ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 2020 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి మధ్య ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి దర్యాప్తు చేపట్టింది.

స్టేడియం నిర్మాణంలో ప్రైవేటు కంపెనీలకు అధిక రేట్లకు కాంట్రాక్టులు ఇచ్చి హెచ్‌సీఏకు నష్టం కలిగించారనే ఆరోపణలున్నాయి. నిధుల దుర్వినియోగం, ప్రైవేట్ ఏజెన్సీలకు నగదు మళ్లింపు జరిగినట్లు గుర్తించింది. అనంతరం హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అన్నీ అవాస్తవాలే..

ఈడీ కార్యాలయానికి హాజరైన అజారుద్దీన్ కార్యాలయంలోకి వెళ్లే ముందు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం గా.. తనపై వచ్చినఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు అభియోగాలు మోపుతున్నారని పేర్కొన్నారు. అన్ని వివరాలు ఈడీ అధికారులకు క్లుప్తంగా వివరిస్తానని చెప్పారు.