calender_icon.png 20 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆజాంజాహి మిల్లు కార్మికులకు ఇండ్ల స్థలాలివ్వాలి

17-04-2025 01:14:34 AM

సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల డిమాండ్ 

ముషీరాబాద్, ఏప్రిల్ 16(విజయక్రాంతి)  : ఆజాంజాహి మిల్లులో ఎంవీఆర్‌ఎస్ ప్రకారం రిటైరైన 300మంది కార్మికులకు 2021లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకా రం ఇండ్ల స్థలాలివ్వాలని సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశార. బుధవారం ఆ పార్టీలు, సంఘాల నాయకులు ఇందిరాపార్క్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు, ఆజంజాహి మిల్లు ఎంవీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆరెళ్ల కృష్ణ , సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు. భాస్కర్, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, తదితరులు మాట్లాడుతూ 318 మంది కార్మికులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 200 గజాల చొప్పున ఇండ్ల స్థలా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆజాంజాహి మిల్ వర్కర్స్ యూనియన్  భవనా న్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కే.విశ్వనాథ్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.