14-04-2025 10:17:02 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద ఎక్లారా గ్రామంలో శంకర్ పటేల్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి విషు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప సన్నిధానం నుండి గ్రామంలో గల హనుమాన్ మందిరం వరకు శోభయాత్ర నిర్వహించి అనంతరం సన్నిధానంలో ఘనంగా మెట్ల పూజ నిర్వహించారు. తదనంతరం మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్,,ముంగ్డేవార్ బస్వంత్ రావు,దిలీప్ పటేల్, ఆశోక్ అప్ప,రాయికర్ అశోక్, బాబు గొండ గురు స్వామి, ముదిరాజ్ విట్టల్, గ్రామస్థులు పాల్గొన్నారు.