06-03-2025 08:39:08 PM
ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
సాములకు అన్నప్రసాదం..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అయ్యప్ప స్వామి ఆలయ 19వ వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం పది గంటల నుండి గర్భగుడిలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి మూలవిరాటుకు అభిషేకాలు నిర్వహించారు. సామూహికంగా అయ్యప్ప స్వాములు, గురు స్వాములు, వినాయకునికి, సుబ్రమణ్య స్వామికి, శ్రీ అయ్యప్ప స్వామికి అభిషేకాలు భజన కార్యక్రమాలు చేపట్టారు. బాన్సువాడ అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన 2006 మార్చ్ ఆరో తారీకు పాల్గొన నమాసం శుద్ధ సప్తమి రోజు అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన చేపట్టారు. ఇప్పటివరకు 19 సంవత్సరాలు పూర్తయ్యాయి. బాన్సువాడలో మొదటిసారి మాల వేసుకు కొన్న శ్రీ బెజగం శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో 8 మంది మాలదరణ మొదటిసారి జరిగింది.
తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ 170 మంది స్వాములు ప్రతి సంవత్సరం మాల వేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇంచుమించు 2000 నుండి 3000 మంది మాలధారణ చేపట్టారు. బాన్స్వాడ అయ్యప్పస్వామి ఆలయంలో గత 12 సంవత్సరముల నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 150 మంది భక్తులకు అన్న ప్రసాదం చేస్తున్నారు. బాన్సువాడలో ఉన్న పెద్దల సహకారం మాజీమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దల సహకారం తీసుకుంటూ బాన్సువాడ నడి ఒడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. హనుమాన్ దీక్ష స్వాములు మాలాధారణ చేసుకున్న దీక్ష స్వాములకు మహా ప్రసాదం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష సాములు, అంబలిపూర్ రాజు గురు స్వామి, కొయ్యగుట్ట ఇటుక రమేష్ స్వామి, కాశీనాథ్ మాజీ స్వామి, గోష్కే సాయి ప్రసాద్ తల్లి జ్ఞాపకార్థం శ్రీ కీర్తిశేషులు జగదాంబ అమ్మ స్వామి జ్ఞాపకార్థం అన్న ప్రసాదం చేశారు.