calender_icon.png 23 December, 2024 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ప్రజలను చల్లంగా సూడు అయ్యప్ప స్వామి

23-12-2024 11:57:32 AM

మంథని,(విజయక్రాంతి): మంథని ప్రజలను సల్లంగా సూడు అయ్యప్పస్వామి అని మంథని పట్టణంలో అయ్యప్పస్వామి 18 మెట్ల మహా పడిపూజ, అగ్నిగుండాల మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు వేడుకున్నారు. ఆదివారం రాత్రి మంథని పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి 18 మెట్ల పడిపూజ, అగ్నిగుండాల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబు పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజలందరు, ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు తమ కుటుంబం మరింత సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని అ అయ్యప్ప స్వామిని కోరుకున్నారు.