calender_icon.png 24 February, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపన

24-02-2025 12:37:14 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): సర్కిల్ పరిధిలోని ఉప్పరపల్లిలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి; విగ్రహ ప్రతిష్టాపన;కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. యోగానంద సరస్వతి స్వామిజీ, రామచంద్ర గోపాలకృష్ణ మఠము వారి ఆధ్వర్యంలో వేడుక జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన,  ధ్వజస్తంభ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి;పంచలోహాల; విగ్రహం 5 అడుగులు నెలకొల్పినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇది భారతదేశంలోనే మొదటి పెద్ద ; విగ్రహం;అన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, నాయకులు, స్థానికులు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.