calender_icon.png 14 January, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం...

01-12-2024 08:46:35 PM

స్వామి పల్లకి మోసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లో శ్రీ అయ్యప్ప సామి ఆరట్టు ఉత్సవంను ఘనంగా నిరహించారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం నుంచి ఆదివారం ప్రారంభమైన ఆరట్టు ఉత్సవం పట్టణ పురవీధుల గుండా కొనసాగింది. మఠాధిపతి శ్రీ యోగానంద సరసతి సామీ ఆధర్యంలో అయ్యప్ప భక్తులు చేపట్టిన ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా అయ్యప్ప సామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.  శోభాయాత్ర లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని సామి వారి పల్లకిని మోశారు. అయ్యప్ప దీక్షదారులు, భక్తుల భజన కీర్తనలు, అయ్యప్ప సామి నామస్మరణతో పట్టణ పురవీధుల మారుమ్రోగాయి. కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించిన డోలు వాయిద్యాలు శోభాయాత్ర లో ప్రత్యేక ఆకరణగా నిలిచాయి. 

దారి పొడవునా మహిళలు భక్తులకు మంగళహారతులతో సాగతం పలికారు. అదేవిధంగా రవీంద్రనగర్ లోని ఉమా మహేశర అయ్యప్ప ఆలయం నుండి దామోదర్ గురుసామి ఆధర్యంలో సైతం ఆరట్టు ఉత్సవాన్ని వైభవమానంగా చేపట్టారు. ఈ  శోభాయాత్రలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని తన సతీమణి రమాదేవి తో కలిసి అయ్యప్ప పల్లకి కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప సాముల ఆశీరాదాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అయ్యప్ప దీక్షదారులు, మహిళలు,  పలువురు భక్తులు పాల్గొన్నారు.