బాన్సువాడ నుండి శబరిమలై కి కాలినడకన వెళ్తున్న స్వాములకు జెండా ఊపి ప్రారంభం
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో అయ్యప్ప దేవాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాన్సువాడ నుంచి పాదయాత్రగా శబరి వెళ్తున్న అయ్యప్ప దీక్ష స్వాములకు జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.